Sun Dec 22 2024 23:56:02 GMT+0000 (Coordinated Universal Time)
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఆటో-లారీ ఢీకొన్నాయి
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఆటో-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వర్ధన్నపేట మండంలోని ఇల్లంద వద్ద వరంగల్-ఖమ్మం నేషనల్ హైవేపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయిదుగురు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటో-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా మరో నలుగురు మృతిచెందారు. కొందరు రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయారు. ప్రమాదం కారణంగా ఆటో నుజ్జునుజ్జు అయిపోయింది. వీరంతా తేనే తీసి అమ్ముకునే వారిగా స్థానికులు గుర్తించారు.
ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య ఐదుకు చేరింది. గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story