Mon Dec 23 2024 05:29:17 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి
చనిపోయిన వారిని కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వికాస్, కళ్యాణ్, మరో మెడికో కల్యాణ్ రామ్..
చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుప్పం సమీపంలోని గుడుపల్లె మండలంలోని చిన్నశెట్టిపల్లిలో లారీ- కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చనిపోయిన వారిని కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వికాస్, కళ్యాణ్, మరో మెడికో కల్యాణ్ రామ్ సోదరుడు ప్రవీణ్ గా గుర్తించారు. ప్రమాదానికి కారు మితిమీరిన వేగమే కారణంగా తెలుస్తోంది. పీఈఎస్ నుంచి కారులో కుప్పం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీరంతా కడప, నెల్లూరుకు చెందిన వారుగా గుర్తించారు. తమ స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా బర్తడే పార్టీ జరుపుకుని కారులో మితిమీరిన వేగంతో వెళ్తూ అదుపుతప్పి ముందు వైపు వెళ్తున్న లారీని ఢీకొన్నారని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story