Mon Dec 23 2024 03:58:54 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే కుటుంబంలో11 మంది మృతి
ఛత్తీస్గడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే మరణఇంచారు.
ఛత్తీస్గడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే మరణఇంచారు. ఒకే కుటుంబానికి చెందిన పదకొండు మంది మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బొలేరో వాహనాన్ని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
వివాహానికి వెళుతుండగా...
ఒక కుటుంబంలోని పదకొండు మంది కలసి ఒక వివాహానికి హాజరయ్యేందుకు బొలేరో వాహనంలో వెళుతున్నారు. ధామ్తరి జిల్లాలోని సోరెమ్ భట్గావ్ గ్రామానికి చెందిన వారు వివాహానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారాలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story