Sun Dec 22 2024 21:19:30 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు స్పాట్ డెడ్
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ లో కంటైనర్ లారీని కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరికొందరికి గాయాలయ్యాయి. గాయలయిన వారిని వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అతి వేగమే...
రోడ్డు ప్రమాదం జరగడంతో ఆ రహదారిపై ట్రాఫిక్ స్థంభించిపోయింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. వేగంగా వచ్చిన కారు వెనక నుంచి కంటైనర్ లారీని ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story