Sun Dec 22 2024 22:05:57 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : హైవేపై రోడ్డు ప్రమాదం.. పది మంది అక్కడికక్కడే మృతి
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ - వడోదర ఎక్స్ప్రెస్ హైవే పై ఈ ప్రమాదం జరిగింది
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ - వడోదర ఎక్స్ప్రెస్ హైవే పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మరణించారు. అతి వేగంతో వచ్చిన ఒక కారున ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ వెనక నుంచి కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న వారు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో...
క్షతగాత్రులును సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంతో అహ్మదాబాద్ - వడోదర హైవే పై చాలా సేపు ట్రాఫిక్ స్థంభించింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్లతో పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం హైవేపై ట్రాఫిక్ సమస్య లేదని, వాహనాలు సాఫీగానే వెళుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
Next Story