Fri Dec 20 2024 16:39:29 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వద్ద అద్దంకి - నార్కట్పల్లి రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు మృతి చెందడంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మరణించిన వారు మిర్యాలగూడ నందిపాడు కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. చెరుపల్లి మహేశ్, జ్యోతి, రిషిత, భూమా మహేందర్, లియాన్సి మరణించారని పోలీసులు తెలిపారు.
యాక్సిడెంట్ చేసి...
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. కొందరిని హైదరాబాద్కు అత్యవసర చికిత్స కోసం తరలించినట్లు పోలీసులు తెలిపారు. కారును లారీ ఢీకొట్టి వెళ్లడంతో పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కారును ఢీకొట్టిన అనంతరం లారీ డ్రైవర్ ఆపకుండా పరారు కావడంతో యాక్సిడెంట్ కు కారణమైన వాహనం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story