Mon Dec 23 2024 04:07:54 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : దర్శనానికి వెళుతూ ప్రమాదం.. ఇద్దరి మృతి.. 15 మందికి గాయాలు
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించగా, పదిహేను మందికి గాయాలయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించగా, పదిహేను మందికి గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిని రెంజర్ల స్వామి కుటుంబ సభ్యులు నిన్న వ్యాన్ లో బడాపహాడ్ దర్గాకు బయలుదేరి వెళ్లారు. వీరు ప్రమాణిస్తున్న వాహనం మల్కాపూర్ గ్రామ శివారులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. వసంత, శ్యాంసుందర్ లను మృతులుగా గుర్తించారు. మొక్కులు చెల్లించుకోవడానికి వెళుతూ ఇద్దరు మృత్యువాతపడ్డారు.
పదిహేను మందికి...
ఇదే వ్యాన్ లో ఉన్న పదిహేను మందికి గాయాలయ్యాయి. మరో ఇద్దరి మహిళల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరిని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వ్యాన్ డ్రైవర్ కృష్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story