Sun Dec 22 2024 12:09:46 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్త పాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. అనంతపురం - గుంటూరు జాతీయ రహదారిపై ఇన్నోవా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గుంటూరుకు చెందిన...
మృతులు గుంటూరుకు చెందిన వారిగ గుర్తించారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వినుకొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story