Sun Dec 15 2024 23:47:45 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. జనం మీదకు దూసుకొచ్చిన లారీ
రంగారెడ్డి చేవెళ్ల మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. కూరగాయలు అమ్మే వారిపై లారీ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది
రంగారెడ్డి చేవెళ్ల మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలూరు స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కూరగాయలు అమ్మే వారిపై లారీ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఏడుగురి పరిస్థితి ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇరవై మంది వరకూ తీవ్ర గాయాలయ్యాయని ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
భారీగా ప్రాణనష్టం?
లారీ అతి వేగంగా వచ్చి అదుపు తప్పి కూరగాయలు విక్రయించే వారిపై దూసుకెళ్లడంతో పెద్ద సంఖ్యలోనే మృతి చెంది ఉండవచ్చని అంచనావేస్తున్నారు. లారీ డ్రైవర్ కూడా క్యాబిన్ లో ఇరుక్కుపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వడంతో అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించే ప్రక్రియను చేపట్టారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Next Story