Fri Mar 28 2025 07:00:36 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లికి వెళ్లి వస్తుండగా.. రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు

సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. సత్యసాయి జిల్లా అగళి మండలం ఇరిగేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం లో ముగ్గురు చనిపోయారు. టాటా ఏస్ వాహనంలో పెళ్లి కి వెళ్లి తిరిగి వస్తున్న వారిని సిమెంట్ లారీ ఢీ కొట్టటం తో ఈ ఘటన జరిగింది.
అతి వేగమే...
ఈ ప్రమాదంలో కాంతప్ప, అమ్మజక్క, రంగప్ప చనిపోయారని పోలీసులు తెలిపారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలిసింది. కొందరు గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story