Mon Dec 23 2024 11:44:28 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు.
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. సూర్యాపేట పట్టణంలోని ఫ్లైఓవర్ పై నిన్న అర్ధరాత్రి ఈఘటన చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పై వెళుతున్న కారును వెనక నుంచి వేగంగా వచ్చి ఒక లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చసేుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు.
మరొకరి పరిస్థితి...
మరొకరు తీవ్రగాయాలపాలు కాగా సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవరు అన్నది ఇంకా తెలియరాలేదు.
Next Story