Mon Mar 31 2025 13:02:41 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. గుర్రంగూడ చౌరస్తాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు.
అతి వేగమే...
అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ఎవరన్నది తెలియరాలేదు. అతి వేగంతో వచ్చిన రెండు కార్లు ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story