Mon Dec 23 2024 03:50:30 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం : 9 మంది మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది మరణించారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది మరణించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కన్యా కుమారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు. బస్పును కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
లారీ బీభత్సం...
ఇక మైలాదురైలో మరో ఘటన జరిగింది. లారీ బీభత్సం సృష్టించింది. బస్సు, బైకును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story