Mon Dec 23 2024 13:15:27 GMT+0000 (Coordinated Universal Time)
ఊహించని ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన గర్భిణీ
హైదరాబాద్ బాలానగర్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. బైక్ను డీసీఎం
హైదరాబాద్ బాలానగర్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. బైక్ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో గర్భిణి మానస మృతి చెందింది. భర్త హరీష్కు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాన్సువాడ మండలంలోని కొత్తాబాది ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఎండీ.ఫర్హాన్(6) ప్రమాదవశాత్తు పాఠశాల వెనుక ఉన్న నిజాంసాగర్ ఉపకాలువలో పడి మృతి చెందాడు. కాలువలో పడిన కొద్దిసేపటికే తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు సమాచారం అందించగా, అప్పటికే విద్యార్థి మృతి చెందాడు. ఆసిఫా, ఉస్మాన్ దంపతులకు ఒక్కగానొక్క సంతానం ఫర్హాన్.
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ జీఎం కార్యాలయానికి సమీపంలోని రింగ్ రోడ్డు పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. గోదావరిఖని వకీల్ పల్లె మైన్ లో కార్మికుడిగా పనిచేస్తున్న యాదవరావు అతని భార్య సుజాత తమ స్వగ్రామమైన తిర్యాని మండలం బోరిదం గ్రామానికి వెళ్లి బైక్ పై తిరిగి వస్తుండగా జాతీయ రహదారి 365 జీఎం కార్యాలయానికి సమీపంలోని రింగ్ రోడ్డుపై బైక్ అదుపుతప్పి రక్షణ రెయిలింగ్ ను ఢీకొట్టిందని శ్రీరాంపూర్ ఎస్సై రాజేష్ తెలిపారు. యాదవ రావు (43) అక్కడికక్కడే మృతి చెందగా సుజాతకు ఎడమ చేయి విరిగింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Next Story