Mon Nov 18 2024 07:41:49 GMT+0000 (Coordinated Universal Time)
సొరంగం తవ్వి.. రైలింజన్ ను ఎత్తుకెళ్లిన దొంగలు
బరౌనీలోని గడారా యార్డుకు రిపేర్ల నిమిత్తం తరలించిన రైలు డీజిల్ ఇంజిన్ భాగాలను దొంగలు ఎత్తుకొని పోయారు. రైలింజన్ ను
ఇటీవల కాలంలో దొంగలు కొత్త పోకడలకు పోతున్నారు. డబ్బు, నగలు, వాహనాలు కాకుండా.. వంతెనలు, రైలింజన్లను ఎత్తుకుపోతున్నాయి. తాజాగా.. బీహార్ లో అలాంటి ఓ ఘటన బయటపడింది. ముజఫర్‌పూర్‌లోని ఓ ఇనుప తుక్కు గోడౌన్‌పై పోలీసులు దాడి చేసినప్పుడు 13 బస్తాల రైలు ఇంజన్ విడిభాగాలు లభ్యమయ్యాయి. వాటిని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. చిన్న చిన్న ఇనుప సామాన్లంటే ఓకే. కానీ.. రైలింజన్ ను కూడా పార్టులు పార్టులుగా విడగొట్టి మరీ అమ్మేస్తున్నారు. ఆఖరికి పాతకాలం నాటి వారసత్వ సంపదలో భాగమైన ఇంజన్లను ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నారు.
బరౌనీలోని గడారా యార్డుకు రిపేర్ల నిమిత్తం తరలించిన రైలు డీజిల్ ఇంజిన్ భాగాలను దొంగలు ఎత్తుకొని పోయారు. రైలింజన్ ను దొంగిలించేందుకు ఆ దొంగలు ఓ సొంరంగం తవ్వారు. దాని ద్వారా యార్డులోకి వెళ్లిన దొంగలు ఇంజన్లను విప్పి విడిభాగాలను బస్తాల్లో వేసుకుని తీసుకుపోయారు. దొంగలే కాదు.. అప్పుడప్పుడూ అధికారులూ చేతివాటాన్ని ప్రద్శిస్తున్నారు. గతేడాది సమస్తిపూర్ లోకో డివిజన్‌కు చెందిన ఓ రైల్వే ఇంజినీర్ పూర్ణియా కోర్టు ఆవరణలో ఉంచిన పాత ఆవిరి ఇంజన్ ను అమ్ముకోవడం సంచలనం రేపింది. ఈ విషయం తెలిసిన ప్రజలు ముందు ముందు దొంగలు ఇంకేం దొంగిలిస్తారో అని ముక్కున వేలేసుకుంటున్నారు.
Next Story