Mon Dec 23 2024 05:02:06 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో దోపిడీ దొంగల బీభత్సం : గ్యాంగ్ రేప్
హైదరాబాద్ నగర శివారులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వివాహితను కిడ్నాప్ చేసి కారులో గ్యాంగ్ రేప్ చేశారు
హైదరాబాద్ నగర శివారులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వివాహితను కిడ్నాప్ చేసి కారులో గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీరం చెరువు వద్ద దోపిడీ దొంగలు వివాహితను అడ్డగించి కారు లో ఎక్కించుకుని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.
బంగారు ఆభరణాలను...
కారులోనే తిప్పుతూ మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారంటూ మహిళ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేయడమే కాకుండా మహిళ దగ్గున్ బంగారు ఆభరణాలను కూడా దోచుకెళ్లారని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story