Mon Dec 23 2024 06:03:03 GMT+0000 (Coordinated Universal Time)
సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో భారీ దోపిడీ
సిగ్నల్ లేకపోవడంతో రైలు స్టేషన్ అవుటర్ లో ఆగిపోయింది. వెంటనే బోగీల్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలు చూపి..
అనంతపురం : తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ రైలులో గత అర్థరాత్రి భారీ దోపిడి జరిగింది. దుండగులు అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ తీగలను కత్తిరించారు. సిగ్నల్ లేకపోవడంతో రైలు స్టేషన్ అవుటర్ లో ఆగిపోయింది. వెంటనే బోగీల్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలు చూపి ప్రయాణికులను భయపెట్టి నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
ఈ ఘటనలో దుండగులు ఎంతమేర దోచుకెళ్లారన్నదానిపై పూర్తి స్పష్టత లేదు. కానీ.. ఆరు తులాల నగలు, పెద్దమొత్తంలో నగదు దోచుకున్నట్లు సమాచారం. దోపిడీ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుల కోసం గాలించారు. అప్పటికే వారు పరారవ్వడంతో.. రైలుకు సిగ్నల్ ఇచ్చి పంపించారు.
Next Story