Mon Dec 23 2024 09:28:34 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి - గుంటూరు రైలులో దోపిడీ
తిరుపతి - గుంటూరు రైలులో దోపిడీ జరిగింది. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో దొంగలు అయిన కాడికి దోచుకెళ్లారు
తిరుపతి - గుంటూరు రైలులో దోపిడీ జరిగింది. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రవేశించిన దొంగలు అయిన కాడికి దోచుకెళ్లారు. అర్ధరాత్రి ఇరుగుపాడు వద్ద ఈ దోపిడీ జరిగినట్లు ప్రయాణికులు వివరించారు. తిరుపతి నుంచి వస్తున్న రైలులోకి ఒక్కసారిగా ప్రవేశించిన దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు.
బంగారు ఆభరణాలను...
మహిళల మెడలో నుంచి బంగారాన్ని దొంగిలించుకుని వెళ్లారు. ఎంత బంగారం పోయిందన్న దానిపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎస్1 బోగీ నుంచి ఎస్ 6 బోగీ వరకూ దొంగలు తమ దోపిడీని యధేచ్ఛగా కొనసాగించారు. ఈ దోపిడీలో 20 నుంచి ఇరవై మంది దొంగలు పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story