Mon Dec 23 2024 03:20:12 GMT+0000 (Coordinated Universal Time)
ఎంత పెద్ద ప్రమాదం.. అయినా బతికాడు
ఎదురుగా వస్తున్న లారీకి ఉన్న తాడు ముత్తు మెడకు చుట్టుకుంది. అంతే.. ముత్తు బైక్ పై నుంచి రోడ్డుపై పడిపోయాడు.
ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేం. ప్రాణాలు అంతే. బయటకు వెళ్లిన వారు తిరిగి వస్తారన్న నమ్మకం కూడా లేదు ఈరోజుల్లో. ఏదో ఒక సంఘటన జరిగి ప్రాణాలు కోల్పోయిన వారు అనేక మంది ప్రతి రోజూ ఏదో ఒక ఘటన వింటూనే ఉంటాం. చూస్తూనే ఉంటాం. అలాంటి ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా లోని వైకుంఠ పట్టణానికి చెందిన ముత్తు అనే యువకుడు బైక్ పై వెళుతున్నాడు.
లారీ తాడును...
అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీకి ఉన్న తాడు ముత్తు మెడకు చుట్టుకుంది. అంతే.. ముత్తు బైక్ పై నుంచి రోడ్డుపై పడిపోయాడు. పది అడుగుల ఎత్తుకు ఎగిరి బైకు నుంచి పడిపోయిన ముత్తు బతకడం కష్టమని చూసినవారందరూ అనుకున్నారు. కానీ ముత్తు లేచి స్వల్పగాయాలతో బయటపడ్డారు. అయితే ముత్తు కొంతసేపు స్పృహ కోల్పోయాడని, వెంటనే నీళ్లు చల్లగా లేచాడని స్థానికులు చెబుతున్నారు. తాడును నిర్లక్ష్యంగా వదిలేసిన లారీ డ్రైవర్ ను స్థానికులు పట్టుకుని కొట్టారు. పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story