Mon Dec 23 2024 09:58:33 GMT+0000 (Coordinated Universal Time)
శంషాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
రూ.80 కోట్లు విలువైన కొకైన్ లభ్యమైంది. టాంజానియాకు చెందిన వ్యక్తితో పాటు ఓ యువతిని, అంగోలా దేశానికి చెందిన..
శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. టాంజానియా నుంచి వచ్చిన ఇద్దరిని డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా.. రూ.80 కోట్లు విలువైన కొకైన్ లభ్యమైంది. టాంజానియాకు చెందిన వ్యక్తితో పాటు ఓ యువతిని, అంగోలా దేశానికి చెందిన మరో యువతిని ఎయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి ట్రాలీ బ్యాగ్ కింద ఉన్న లేయర్ లో ఈ కొకైన్ లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 8 కేజీల కొకైన్ ను అధికారులు సీజ్ చేశారు.
కాగా.. ఇటీవల విజయవాడలోనే డ్రగ్స్ కలకలం రేగింది. నగరానికి చెందిన కొరియర్ సంస్థ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన పార్శిల్ పొరపాటుగా కెనడాకు వెళ్లింది. అడ్రస్ సరిగా లేకపోవడంతో ఆ పార్శిల్ ను తిరిగి వెనక్కి పంపగా.. స్క్రీనింగ్ లో ఆ పార్శిల్ లో డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. దాంతో సదరు కొరియర్ సంస్ధ యజమానిని బెంగళూరు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
Next Story