Mon Dec 23 2024 10:14:16 GMT+0000 (Coordinated Universal Time)
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత
ఆదివారం దోహా నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి రూ.89 లక్షల 74 వేలు విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం..
శంషాబాద్ : రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతినిత్యం డ్రగ్స్, బంగారం స్మగ్లింగ్ చేసేవాళ్లు పట్టుబడుతూనే ఉంటారు. తాజాగా ఎయిర్ పోర్టు అధికారులు ప్రయాణికులను తనిఖీ చేయగా.. 1630 గ్రాముల బంగారం లభ్యమైంది. ఆదివారం దోహా నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి రూ.89 లక్షల 74 వేలు విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేటుగాళ్లు బంగారాన్ని పేస్టుగా మార్చి పొట్టలో దాచినట్లు అధికారులు తెలిపారు. దోహా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలిందన్నారు. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story