Thu Dec 19 2024 19:10:08 GMT+0000 (Coordinated Universal Time)
రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
అనూహ్య ఘటనతో ఈ గంజాయిని పట్టుకున్న పోలీసులకు.. నిందితులెవరూ చిక్కలేదు. ఆనందపురం మండలం నీళ్లకుండీల జంక్షన్లో..
విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణా శృతి మించుతోంది. గంజాయి రవాణా అడ్డుకునేందుకు పోలీసులు వేస్తున్న ఎత్తులకు స్మగ్లర్లు పై ఎత్తులు వేసి గంజాయిని రాష్ట్రాలు దాటిస్తున్నారు. విశాఖ జిల్లా నుంచి గంజాయి అధికంగా రవాణా అవుతోంది. తాజాగా పోలీసులు రూ.2 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అనూహ్య ఘటనతో ఈ గంజాయిని పట్టుకున్న పోలీసులకు.. నిందితులెవరూ చిక్కలేదు. ఆనందపురం మండలం నీళ్లకుండీల జంక్షన్లో ఆగి ఉన్న వ్యాన్ ను మరో వ్యాన్ వచ్చి ఢీ కొట్టింది. దాంతో ఆగి ఉన్న వ్యాన్ బోల్తా పడి అందులో ఉన్న బస్తాలు బయటపడ్డాయి. వాటిని పోలీసులు పరిశీలించగా.. 57 బస్తాల్లో 2,280 కేజీల గంజాయి బయటపడింది. దాని విలువ రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనానికి నెంబర్ ప్లేటు తొలగించటంతో ఇంజన్ నెంబరు, ఛాసిస్ నెంబర్లు ఆధారంగా పోలీసులు దాని యజమానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story