Mon Dec 23 2024 09:25:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారు బిస్కెట్లు సీజ్
దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేయగా.. 6 బంగారం బిస్కెట్లు లభించాయి. వాటిని కస్టమ్స్ అధికారులు..
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద బంగారు బిస్కెట్లను గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేయగా.. 6 బంగారం బిస్కెట్లు లభించాయి. వాటిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా.. బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.
సుమారు రూ.37.30 లక్షలు విలువైన 699.5 గ్రామాల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడిని అదపులోకి తీసుకుని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Next Story