Fri Dec 20 2024 18:42:54 GMT+0000 (Coordinated Universal Time)
Vikarabad : బ్రేక్ ఫెయిలై లోయలో పడిన బస్సు
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. అనంతగిరి కొండల్లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో.. లోయలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. అనంతగిరి కొండల్లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story