Thu Dec 26 2024 01:09:31 GMT+0000 (Coordinated Universal Time)
వరంగల్ డిపో ఆర్టీసీకి తప్పిన ప్రమాదం
హనమకొండ నుంచి వరంగల్ వెళుతున్న ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది
హనమకొండ నుంచి వరంగల్ వెళుతున్న ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన ప్రయాణికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ నుంచి వెళుతుండగా...
వరంగల్ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండ నుంచి వరంగల్ కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే అదుపుతప్పడానికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? లేక సాంకేతిక కారణాలా? అన్నది తెలియాల్సి ఉంది. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలను చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story