Mon Dec 23 2024 14:40:15 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు
జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని కాకినాడ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ..
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస్ నగర్ వద్ద జరిగింది. జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని కాకినాడ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందగా.. 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మర్కాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషమంగా ఉన్న ఇద్దరిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. జయశంకర్ భూపాపల్లి జిల్లా మాదేపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం యువకుడి ప్రాణం తీసింది. కాళేశ్వరం - కన్నేపల్లి మధ్య జాతీయ రహదారిపై బైకర్ ను టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కన్నేపల్లికి చెందిన శేఖర్ అనే యువకుడు మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుడిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు.
Next Story