Sun Dec 22 2024 22:28:00 GMT+0000 (Coordinated Universal Time)
బోల్తా కొట్టిన ఆర్టీసీ బస్సు
ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం సమీపంలోని ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి మార్కాపురం వెళుతున్న ఇంద్ర బస్సు ఈ ప్రమాదానికి గురయినట్లు అధికారులు వెల్లడించారు.
8 మందికి గాయాలు...
అయితే ఈ బస్సులో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఎనిమిది మంది ప్రయాణికులు మాత్రం ఈ ప్రమాదం కారణంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎవరీకీ ప్రాణపాయం లేదని వైద్యులు చెప్పారు.
Next Story