Mon Dec 23 2024 18:54:45 GMT+0000 (Coordinated Universal Time)
ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ.. పంటపొలాల్లో బోల్తా
లారీని ఢీ కొట్టిన బస్సు.. 15 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. మరో 34 మంది..
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో ఘోర రెడ్డుప్రమాదం జరిగింది. ఆత్మకూరు నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు.. ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నెల్లూరు- బళ్లారి రహదారిపై బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు మఠం కాలనీ వద్ద జరిగింది. లారీని ఢీ కొట్టిన బస్సు.. 15 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. మరో 34 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులను 108 వాహనాల్లో నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లోనూ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. కాగా.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story