Sun Dec 22 2024 17:41:18 GMT+0000 (Coordinated Universal Time)
పందెం కోడిని నీటిలో ఆడించాలని అనుకున్నారు.. తీరా!
ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలం కవ్వగుంట సమీపంలోని
ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలం కవ్వగుంట సమీపంలోని పోలవరం కుడికాల్వలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. కవ్వగుంట గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(50) తన ఇద్దరు కుమారులు మణికంఠ(16), సాయి కుమార్ (13)తో కలిసి పోలవరం కుడికాల్వ వద్దకు తమ పందెం కోడిని తీసుకుని వెళ్లారు. పందెం కోడిని ఈత కొట్టిస్తుండగా ముగ్గురు కాల్వలో గల్లంతయ్యారు. తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా, మరో కుమారుడి ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు.
నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు అక్కడిక్కడే మరణించారు. సురేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బోథ్ మండలం కుచ్లాపూర్ నుంచి లోకేశ్వరం మండలం మన్మద్ వెళ్తుండగా నర్సాపూర్ (బి) మండలం చాక్పెల్లి వద్ద కారును చెట్టును ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో సురేశ్ (27), అతని కుమారుడు దీక్షిత్ (7) అక్కడిక్కడే మృతి చెందారు. సురేశ్ భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story