Mon Dec 23 2024 04:01:47 GMT+0000 (Coordinated Universal Time)
ఎస్సీ, ఎస్టీ కేసు.. మనస్తాపంతో యువరైతు ఆత్మహత్య
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం, నాయిని బావి పంచాయతీ గుట్టపాలెం గ్రామంలో..
తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని.. లాక్కునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించిన నేపథ్యంలో.. మనస్తాపంతో యువరైతు తన పొలంలోని చెట్టుకే ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం, నాయిని బావి పంచాయతీ గుట్టపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత రైతు తిప్పతాతగారి మంజునాథరెడ్డి(40)కి తన తండ్రి వెంకట రమణారెడ్డికి చెందిన భూమి వారస్వంగా వచ్చింది. తండ్రి పేరున ఉన్న భూమిని పట్రపల్లికి చెందిన గంగులప్ప అనే వ్యక్తి షూరిటీగా రాయించుకుని.. ఆ తర్వాత దానిని కాజేశాడు.
ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని కోరుతూ.. మంజునాథరెడ్డి స్థానిక కోర్టును ఆశ్రయించాడు. కేసు కోర్టులో ఉండగానే.. ఆ భూమిలో టాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసుకునేందుకు మంజునాథ ప్రయత్నించాడంటూ.. గంగులప్ప బి.కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేసి, అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించి నోటీసులు పంపాడు. దీంతో మనస్థాపం చెందిన బాధితుడు మంజునాథ రెడ్డి శనివారం తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న చింత చెట్టుకు శనివారం ఉరి వేసుకుని బలవన్మరణం చెందిన విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు మంజునాథ ఆత్మహత్యను గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంజునాథ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు.
Next Story