Fri Dec 20 2024 17:23:02 GMT+0000 (Coordinated Universal Time)
అస్సాంలో ప్రిన్సిపాల్ గా ఒంగోలు వ్యక్తి.. విద్యార్థిని మందలించడంతో!!
ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ అస్సాంలోని
ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ అస్సాంలోని శివసాగర్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. కెమిస్ట్రీ సరిగా చదువుకోవడం లేదనే కారణంగా ప్రిన్సిపాల్ రాజేష్ ఓ విద్యార్థిని మందలించడంతో ఈ సంఘటన జరిగింది. విద్యార్థి కోపంతో రాజేష్ క్లాసులు చెబుతున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాజేష్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అస్సాం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రాజేష్ అస్సాంలోని శివసాగర్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు స్కూల్‌కు ప్రిన్సిపల్, లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థికి కెమిస్ట్రీలో మార్కులు తక్కువగా వచ్చాయని రాజేష్ మందలించాడు. దీంతో అతడిపై ఆ విద్యార్థి తీవ్రంగా కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాజేష్ తరగతి గదిలో క్లాసు చెబుతుండగా అతడిపై విద్యార్థి కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రాజేష్ చాలా మంచి వ్యక్తి అని ఇతర విద్యార్థులు తెలిపారు. రాజేష్ కుటుంబంలో ఊహించని విషాదం నెలకొంది.
Next Story