Mon Dec 23 2024 18:35:02 GMT+0000 (Coordinated Universal Time)
ఘోరం.. చిన్నారులపైకి దూసుకెళ్లిన స్కూల్ వ్యాన్, స్పాట్ డెడ్
మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు.. మృతదేహంతో సాగర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రమాదానికి..
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులపైకి స్కూల్ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొక చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగుడలో మంగళవారం ఉదయం జరిగింది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్.. బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు.
ప్రమాదంలో చనిపోయిన విద్యార్థి స్థానికుడు కాదని.. బీహార్ కు చెందిన కుటుంబంగా గుర్తించారు. తీవ్రగాయాలైన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు.. మృతదేహంతో సాగర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. నిరసనకారులకు నచ్చజెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
Next Story