Mon Dec 23 2024 05:02:57 GMT+0000 (Coordinated Universal Time)
మైనర్ కూతురిపై తండ్రి అత్యాచారం.. అడ్డుకోవాల్సిన తల్లే సహకరించిన వైనం
కాశీపూర్ గడ్డ కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన మైనర్ కుమార్తెను భార్యతో కలిసి శారీరకంగా వేధిస్తున్నట్లు కవిత బుటోలా సెంటర్..
మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో మానవ బంధాలను దెబ్బతీసే ఘటన ఒకటి వెలుగులోకొచ్చింది. కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో తండ్రి. ఈ దారుణాన్ని చూసిన తల్లి.. తన మైనర్ కూతురికి అండగా నిలబడాల్సిందిపోయి.. భర్తకు సాయం చేసింది. ఈ కేసులో నిందితులైన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలోని కాశీపూర్ లో మైనర్ కుమార్తెతో తండ్రి బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సహకరించడం గమనార్హం.
కాశీపూర్ గడ్డ కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన మైనర్ కుమార్తెను భార్యతో కలిసి శారీరకంగా వేధిస్తున్నట్లు కవిత బుటోలా సెంటర్ నిర్వాహకురాలు సఖి వన్ స్టాప్ సెంటర్ రుద్రాపూర్కు సెప్టెంబర్ 1న ఫిర్యాదు అందిందని సీఓ వందన వర్మ తెలిపారు. కాగా.. నిందితుడు బాధితురాలికి మారు తండ్రి. ఈ కేసులో బాధితురాలైన బాలిక మాట్లాడుతూ.. తనకు మారుతండ్రైన వ్యక్తి తనతో లైంగి సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేశాడని, ప్రతిఘటించగా తనను కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడని వాపోయింది. ఈ విషయం తల్లికి చెప్పగా.. ఆమె తనకు ఆసరాగా ఉండాల్సిందిపోయి.. నిందితుడైన వ్యక్తికి సపోర్ట్ చేసిందని తెలిపింది. బాలిక వాంగ్మూలంతో దంపతులపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పటి నుండి వారు పరారీలో ఉండగా.. వారికోసం గాలించారు. ఢిల్లీలోని కరోల్బాగ్లో ఉన్నారని సమాచారం రాగా.. కుందేశ్వరి పీఎస్ పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు.
Next Story