Thu Dec 19 2024 12:34:46 GMT+0000 (Coordinated Universal Time)
ముగ్గురు మావోల మృతి
ఛత్తీస్ఘడ్ , మహారాష్ట్ర సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతాదళాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి.
ఛత్తీస్ఘడ్ , మహారాష్ట్ర సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతాదళాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కొనసాగుతున్న కూంబింగ్...
మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జిరగాయి. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసు అధికారులు వెల్లడించారు.
Next Story