Fri Nov 22 2024 15:42:14 GMT+0000 (Coordinated Universal Time)
రూ.1.17 కోట్ల విలువైన బంగారం, 62,400 సిగరెట్లు సీజ్
ముగ్గురి వద్ద నుంచి కోటి 17 లక్షల రూపాయల విలువైన ఒక కిలో 93 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు..
అంతర్జాతీయ ఎయిర్ పోర్టులలో తరచూ డ్రగ్స్, బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. స్మగ్లర్లు పట్టుబడుతున్నారు. కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించేందుకు రకరకాలుగా స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించేవారిని.. అధికారులు పట్టుకుంటున్నారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను, వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం ద్వారా వారు చేసే స్మగ్లింగ్ బండారం బయటపడుతోంది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో జెడ్డా, దుబాయ్, బ్యాంకాక్ ల నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా.. బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.
ముగ్గురి వద్ద నుంచి కోటి 17 లక్షల రూపాయల విలువైన ఒక కిలో 93 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. ముగ్గురినీ అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి రూ.84.8 లక్షల విలువైన 1399 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి వచ్చిన మరో వ్యక్తి నుంచి రూ.31.8 లక్షల విలువైన 526 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్, బ్యాంకాక్ ల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా.. పెద్దమొత్తంలో సిగరెట్లను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి మొత్తం 62,400 సిగరెట్ల స్టిక్ లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
Next Story