Mon Dec 23 2024 07:08:34 GMT+0000 (Coordinated Universal Time)
అప్సర హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు
అప్సర తల్లిన సాయికృష్ణ అక్కయ్యగారూ అంటూ పలకరించేవాడని స్థానికులు తెలిపారు. అయితే వాళ్లద్దరి మధ్య..
సరూర్ నగర్ కు చెందిన అప్సర(30) ఓ పూజారి చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్రకలకలం రేపింది. అప్సరకు ట్యాబ్లెట్ల ద్వారా మత్తుమందు ఇచ్చి.. ఆపై ఆమెను బండరాయితో మోది చంపిన పూజారి అయ్యంగారి వెంకట సాయికృష్ణ.. సరూర్ నగర్ లోని ఓ ఖాళీప్రాంతంలో మ్యాన్ హోల్ లో పడేసి, దానిపై సిమెంట్ తో పూడ్చేశాడు. జూన్ 3నే ఆమెను హత్యచేసి ఏమీ ఎరుగనట్టు.. భద్రాచలం వెళ్తానన్న తన మేనకోడలు కనిపించడం లేదంటూ జూన్ 5న అప్సర తల్లితో కలిసి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతనిపై అనుమానంతో కాల్ డేటా, ఇద్దరి సెల్ఫోన్ల సిగ్నల్స్ పరిశీలించగా.. సాయికృష్ణ నిందితుడని అనుమానం కలిగి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో నేరాన్ని అంగీకరించాడు.
నిజానికి అప్సర-సాయికృష్ణలు బంధువులు కాదు. అప్సర తల్లిన సాయికృష్ణ అక్కయ్యగారూ అంటూ పలకరించేవాడని స్థానికులు తెలిపారు. అయితే వాళ్లద్దరి మధ్య ఏం జరిగిందో తనకు తెలీదని అప్సర తల్లి అంటుంటే.. అన్నా అని పిలిచి.. పెళ్లిచేసుకోమని ఎలా అడుగుతుందని సాయికృష్ణ తండ్రి ఆరోపిస్తున్నారు. ఇంట్లో కోయంబత్తూరు వెళ్తున్నట్లు చెప్పిందని అప్సర తల్లి చెబుతున్నారు. ఫోర్డ్ కారులో సరూర్ నగర్ నుంచి బయల్దేరిన అప్సర, సాయికృష్ణ శంషాబాద్ చేరుకున్నాక రాళ్లగూడ వైపు వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి భోజనం చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం అప్సర కారులోని ముందర సీటులో రిలాక్స్ అవుతుండగా.. అప్పటికే తనతో తెచ్చుకున్న కర్రతో సాయి అప్సర తలపై కొట్టి హత్యచేశాడు. ఆ కారులోనే అప్సర మృతదేహాన్ని తీసుకుని ఇంటికెళ్లిన సాయి.. ఒకరోజంతా మృతదేహాన్ని అందులోనే ఉంచాడు. మర్నాడు మృతదేహాన్ని మ్యాన్ హోల్ లో పడేసి మట్టి, సిమెంట్ కలిపి పూడ్చేశాడు.
సాయికృష్ణ పూజారిగా పనిచేసే గుడిపక్కనే అప్సర నివాసం ఉంటుంది. రోజూ గుడికివచ్చే అప్సరతో సాయికృష్ణకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసినట్లు తెలిసింది. అప్సర గతంలో గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించినట్లు సాయికృష్ణ పోలీసుల విచారణలో తెలిపాడు. ఆమె తనతో పాటు మరికొందరితో కూడా సన్నిహితంగా ఉండేదని సాయికృష్ణ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మరోసారి గర్భందాల్చి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అప్సర మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా కు పంపామని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చేంత వరకూ ఆగాల్సిందేనని తెలిపారు. పెళ్లై పిల్లలున్న సాయికృష్ణ.. పవిత్రమైన పూజారిహోదా లో ఉండి.. యువతితో అక్రమసంబంధం పెట్టుకోవడమే కాకుండా.. పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే ఆమెను చంపానని చెప్పడంతో ఈ కేసు సంచలనానికి దారితీసింది.
Next Story