Thu Mar 27 2025 22:05:37 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో ముగ్గురు మృతి చెందారు.

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో ముగ్గురు మృతి చెందారు. ఏలూరు చొదిమెళ్ల వద్ద సిమెంట్ లారీని వెనక నుంచి ఢీకొట్టిన బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
అతి వేగమే...
గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణం అతి వేగమేనని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతులు ఎవరన్న దానిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story