Sun Dec 22 2024 21:21:46 GMT+0000 (Coordinated Universal Time)
Accident : ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరి మృతి
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. లారీని మరొక లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన మరొక లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. లారీ టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి మరమ్మతులు చేస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన మరొక లారీ ఢీకొట్టింది.
నిద్రమత్తే కారణమని...
అయితే డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. లారీలో నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. మృతులు ఎవరన్నది తెలియరాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story