Sun Dec 22 2024 18:14:42 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురి మృతి
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాగులోకి కారు దూసుకెళ్లడంతో ఏడుగురు మరణించారు.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివంపేటలో ఈ ప్రమాదం జరిగింది. వాగులోకి కారు దూసుకెళ్లడంతో ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతులంతా పాముల తండా వాసులుగా పోలీసులు గుర్తించారని తెలిసింది. కల్వర్టును ఢీకొని కారు వాగులోకి పడింది.
మృతులందరూ...
వాగులోకి దూసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అతి వేగం కారణంగానే కారు వాగులోకి దూసుకెళ్లిందని తెలిపింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు ఆ ప్రాంతానికి వచ్చి రోదిస్తున్నారు. అయితే కారు బ్రేకులు ఫెయిలయి ఈ ప్రమాదం జరిగిందా? లేక అతి వేగంతో ఈ ప్రమాదం సంభవించిందా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story