Wed Mar 26 2025 22:23:35 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు వెళ్లి లారీని వేగంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అద్దంకి - నార్కేట్ పల్లి జాతీయ రహదారిలోని రాజుపాలెం మండలం పెద్దనెమలిపురి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
లారీని కారు ఢీకొట్టడంతో...
హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు వెళుతున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా వారంతా ఒకే కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. లారీని ఢీకొట్టడంతో ట్యాంకర్ ను ఢీకొట్టడంతో అదుపు తప్పి కారుపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు షేక్ హబీబుల్లా, నూరుల్లా, షేక్ నజీమాగా గుర్తించారు. ఈ ప్రమాదానికి కారణం ట్యాంకర్ డ్రైవర్ నిద్రమత్తు కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story