Mon Dec 23 2024 17:14:43 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోను లారీ ఢీకొట్టడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని థరూర్ మండలంల కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటోను లారీ ఢీకొట్టడంతో నలుగురు మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆటోను లారీ...
గాయాల పాలయిన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు రవి, కిషన్, హేమ్లా, ఆటో డ్రైవర్ జమీల్ గా అధికారులు గుర్తించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story