Sun Dec 22 2024 01:33:00 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం.. ఆపై తన మిత్రులకు అప్పగించి..
మర్నాడు ఆ వీడియోను బాధిత బాలికకు పంపి.. తన స్నేహితులకు డబ్బులివ్వాలని, లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని..
బెంగళూరు : ప్రేమ పేరుతో బాలికకు వల వేసిన యువకుడు.. ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను తన మిత్రులకూ అప్పగించాడు. ఈ దారుణ ఘటన బెంగళూరు శివారులోని యలహంకలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 16 ఏళ్ల బాలికను 25 ఏళ్ల యువకుడు ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. తనతో మాట్లాడాలని చెప్పి.. యలహంకలోని ఓ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న నిందితుడి స్నేహితుడు తన మొబైల్ లో చిత్రీకరించాడు.
మర్నాడు ఆ వీడియోను బాధిత బాలికకు పంపి.. తన స్నేహితులకు డబ్బులివ్వాలని, లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దాంతో బాధిత బాలిక కొంత డబ్బు సేకరించి, వారికి ఇచ్చింది. అక్కడితే వదలకుండా వారంరోజులపాటు బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో కూతురు కొద్దిరోజులుగా ముభావంగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని అడగటంతో.. బాలిక బోరుమని విలపిస్తూ జరిగిన ఘటనను గురించి వారికి వివరించింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఇద్దరు మైనర్లు సహా ఏడుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
Next Story