Mon Dec 23 2024 14:30:10 GMT+0000 (Coordinated Universal Time)
7నెలల గర్భిణీని చంపి.. బిడ్డను ఎత్తుకెళ్లారు
ఒహానా మృతదేహం దగ్గర కొన్ని డబ్బులు కూడా పడి ఉన్నాయని తెలిపారు. మృతదేహం దొరికిన ప్రాంతంలో..
ఓ గర్భిణీ దారుణ హత్యకు గురైంది. అందుకు గల కారణం తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. సెప్టెంబర్ 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బ్రెజిల్ లోని సావో పాలోలోని పోర్టల్ డాస్ లాగోస్ లో ఒహానా కరోలిన్ అనే 24 ఏళ్ల మహిళ మృతదేహం కనిపించింది. ఆమె పేరు ఒహానా. ముగ్గురు పిల్లలకు తల్లైన ఆమె.. చనిపోయే సమయానికి ఏడు నెలల గర్భిణీగా ఉంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతురాలిని చంపి, ఆమె పొట్టను చీల్చి కడుపులోని బిడ్డను దుండగులు ఎత్తుకెళ్లినట్లు గురించారు.
మతపరమైన ఆచారాలను నెరవేర్చేందుకే మహిళను హత్యచేసి, బిడ్డను ఎత్తుకెళ్లి బలిచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒహానా మృతదేహం దగ్గర కొన్ని డబ్బులు కూడా పడి ఉన్నాయని తెలిపారు. మృతదేహం దొరికిన ప్రాంతంలో చాలా చర్చిలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఒహానా తన భర్త నుంచి విడిపోయి ప్రియుడితో ఉంటోంది. అయితే ఇది ఆమె మాజీ భర్త పనా ? లేక బిడ్డకోసం ఎవరైనా కావాలని చేసిన పనా అన్న విషయం తెలియాల్సి ఉంది.
Next Story