Mon Dec 15 2025 04:10:52 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో కాల్పులు : ఏడుగురి మృతి
కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే సమీపంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే సమీపంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. అమెరికాలో వరసగా మూడు కాల్పుల ఘటనలు జరగడంతో ప్రజలు బయటకుక రావడానికి భయపడిపోతున్నారు. నిన్న అమెరికాలోని చికాగోలో ఒక నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో ఒక తెలుగు విద్యార్థి మరణించారు. గాయపడిన సాయిచరణ్ పరిస్థిితి ఆందోళనకరంగానే ఉందని చెబుతున్నారు.
చికాగోలో ఇద్దరిపై...
చికాగోలో ఇద్దరు విద్యార్థులపై నల్లజాతీయుడు కాల్పులు జరపగా వారిలో ఒకరు మృతి చెందారని చెబుతున్నారు. విజయవాడకు చెందిన దేవాన్ష్, హైదరాబాద్ కు చెందిన సాయిచరణ్ లు నడుచుకుంటూ వెళుతుండగా నల్లజాతీయుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక కేసులో నిందితుతు తమ అదుపులో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
Next Story

