Sun Dec 22 2024 18:06:48 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్ళికి హాజరైన కుటుంబం.. పిల్లాడు కనిపించకపోవడంతో..!
హైదరాబాద్ శంషాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏడేళ్ల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు
హైదరాబాద్ శంషాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏడేళ్ల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివాహ వేడుకలకు హాజరైన నందిగామకు చెందిన దంపతుల కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందాడు.నందిగామకు చెందిన శ్రీకాంత్ రెడ్డి కుటుంబం బుధవారం శంషాబాద్ పరిధి మై ఫెయిర్ ఫంక్షన్ హాల్ లో జరిగే పెళ్లికి హాజరైంది. శ్రీకాంత్ రెడ్డి కుమారుడు అభిజిత్ రెడ్డి (7) ఫంక్షన్ హాల్ కనిపించకుండా పోయాడు. తన కుమారుడు తప్పిపోయాడని సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు శ్రీకాంత్ రెడ్డి కంప్లయింట్ చేశాడు. పోలీసులు ఫంక్షన్ హాల్ పరిసరాలతో పాటు డ్రైనేజీ సంపును పరిశీలించగా అందులో అభిషేక్ రెడ్డి శవమై కనిపించాడు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
తన కొడుకు మృతికి ఫంక్షన్ హాల్ యాజమాన్యమే కారణమని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించాడు. డ్రైనేజీ సంపు పై కప్పు లేకపోవడంతో అందులో పడి బాలుడు మృతి చెందాడని ఫంక్షన్ హాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఫంక్షన్ హాల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసు నమోదు చేస్తామని శంషాబాద్ ఏసీపీ రామచంద్రరావు తెలిపారు. ఫంక్షన్ హాల్ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా తమ కొడుకు విజిత్ రెడ్డి సంపులో పడి చనిపోయినట్లుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి ఫంక్షన్ హాల్ బయట రోడ్డుపై బైఠాయించి బాలుడి కుటుంసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. బాలుడు మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Next Story