Fri Dec 20 2024 17:01:29 GMT+0000 (Coordinated Universal Time)
రూ.200 కోట్లను అలా ఈజీగా ముంచేసింది
శిల్ప టాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్షియర్లతో పరిచయాలను పెంచుకోవడానికి వీకెండ్ పార్టీలను ఉపయోగించుకుంది.
వారిని నమ్మించి మోసం చేసింది. శిల్ప చౌదరి టాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్షియర్లతో పరిచయాలను పెంచుకోవడానికి వీకెండ్ పార్టీలను ఉపయోగించుకుంది. మహిళ పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలను కిట్టీ పార్టీల ద్వారా ఆకట్టుకుంది. దీంతో శిల్ప చౌదరి వలలో వారంతా పడ్డారు. దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు మోసం చేసిన శిల్పా చౌదరిపై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పుప్పాలగూడ కు చెందిన దివ్యారెడ్డి ఫిర్యాదు మేరకు శిల్ప చౌదరి దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంతో....
బాక్ల మనీని వైట్ చేస్తానని చెప్పి కూడా శిల్పా చౌదరి మోసం చేసింది. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని దివ్యారెడ్డి నుంచి కోటిన్నర వసూలు చేసింది. స్థలాన్ని కూడా చూపెట్టకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని దివ్యారెడ్డి కోరింది. అయితే తన బౌన్సర్లతో దివ్యారెడ్డిని శిల్పా చౌదరి బెదిరించింది. శిల్పా వలలో పడిన వారిలో ఇద్దరు ప్రముఖ నిర్మాతల కుమార్తెలు కూడా ఉన్నారు. ఒక టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఉన్నారని చెబుతున్నారు. శిల్పా చౌదరి చేతిలో మోసం పోయిన వారు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.
Next Story