Mon Dec 23 2024 11:27:49 GMT+0000 (Coordinated Universal Time)
శిల్ప అస్సలు సహకరించలేదట
మూడు రోజుల విచారణ అనంతరం నేడు శిల్పా చౌదరిని కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.
మూడు రోజుల విచారణ అనంతరం నేడు శిల్పా చౌదరిని కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. శిల్పా చౌదరి మూడు విచారణ పూర్తయింది. అయితే ఈ విచారణలో ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా శిల్పా చౌదరి దాట వేశారని తెలుస్తోంది.
మరోసారి...
ప్రముఖులను మోసం చేసిన కేసులో శిల్పా చౌదరిని మూడు రోజులు విచారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మరోసారి కస్టడీకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నేడు ఉప్పర్ పల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. ఆమె అకౌంట్ల వివరాలు కూడా చెప్పలేదని సమాచారం.
Next Story