Fri Dec 20 2024 11:22:34 GMT+0000 (Coordinated Universal Time)
శిల్పా చౌదరి విడుదల... ప్రతి శనివారం
చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు కావడంతో ఆమె విడుదలయ్యారు
చంచల్ గూడ జైలులో ఉన్న శిల్పా చౌదరి విడుదలయ్యారు. రిమాండ్ ఖైదీగా ఉన్న శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు కావడంతో ఆమె విడుదలయ్యారు. శిల్పా చౌదరికి షరతులతో కూడిన బెయిల్ ను ఉప్పరపల్లి కోర్టు మంజూరు చేసింది. ప్రతి శనివారం ఖచ్చితంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
మోసం చేసిన కేసులో....
ప్రముఖులను మోసంచేసిన కేసులో శిల్పా చౌదరి ఇరవై ఐదు రోజుల పాటు జైలులో ఉన్నారు. ఆమెను మూడుసార్లు పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు ప్రముఖుల నుంచి తీసుకుని ఎగ్గొట్టడంతో శిల్పా చౌదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story