Sat Apr 12 2025 04:51:56 GMT+0000 (Coordinated Universal Time)
ఔటర్ రింగురోడ్డుపై కాల్పులు.. పోలీసుల గాలింపు
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కాల్పులు కలకలం రేపాయి. కారులో వచ్చిన దుండగులు లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపారు

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కాల్పులు కలకలం రేపాయి. కారులో వచ్చిన దుండగులు లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపారు. ఐరన్ ఓర్ లోడ్ తో వెళుతున్న లారీపై కారులో వచ్చిన ఆగంతకులు కాల్పులు జరిపారు. అయితే లారీ డ్రైవర్ మనోజ్ ఈ కాల్పుల్లో గాయపడలేదు. సురక్షితంగా బయటపడ్డాడు. ఈ లారీ మెదక్ నుంచి కేరళలోని కొచ్చి నగరానికి ఐరన్ లోడ్ తో వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
నాలుగు మార్గాలు..
కాల్పుల్లో కారు అద్దాలు పగిలిపోయాయి. వెంటనే డ్రైవర్ డయల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు వచ్చారు. ఇది అంతరాష్ట్ర దొంగల ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం మూడు బృందాలు వెదుకులాటను ప్రారంభించాయి. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. నగరం నుంచి వెళ్లే నలువైపుల వారి కోసం గాలిస్తున్నారు. లారీలను అడ్డగించి వారి నుంచి దోపిడీకి పాల్పడటం ఈ దొంగల పని అని, గతంలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
Next Story