Sat Dec 21 2024 01:48:17 GMT+0000 (Coordinated Universal Time)
శ్రద్ధ తరహా ఘటన.. ప్రియురాలిని చంపి ఫ్రిజ్ లో కుక్కి..
సాహిల్, నిక్కీ ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. మిత్రాన్ గ్రామానికి చెందిన సాహిల్.. హర్యానాలోని ఝజ్జర్ నివాసి..
ఢిల్లీలో మరో శ్రద్ధ హత్య తరహా ఘటన వెలుగుచూసింది. తన ప్రియురాలిని చంపి, ఫ్రిడ్జ్ లో కుక్కి, అదే రోజున మరో యువతిని పెళ్లాడాడో హంతకుడు. ఈ ఘటన నజఫ్ గఢ్ లోని మిత్రాన్ గ్రామ శివార్లలోని ధాబాలో వెలుగుచూసింది. తన 22 ఏళ్ల లివ్ ఇన్ పార్టనర్ ను హత్య చేసి ఆమె మృతదేహాన్ని నజఫ్ గఢ్ లోని మిత్రాన్ గ్రామ శివార్లలో ఉన్న ధాబా ఫ్రిడ్జ్ లో దాచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతురాలిని నిక్కీ యాదవ్ గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాహిల్, నిక్కీ ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. మిత్రాన్ గ్రామానికి చెందిన సాహిల్.. హర్యానాలోని ఝజ్జర్ నివాసి అయిన నిక్కీని 2018లో ఉత్తమ్ నగర్ ప్రాంతంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కలిశాడు. ఆ తర్వాత గ్రేటర్ నోయిడాలోని అదే కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. ఇద్దరూ కలిసి నోయిడాలోనే ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎవరి ఇళ్లకు వారు తిరిగి వెళ్లిపోయారు. లాక్ డైన్ ముగిసిన అనంతరం మళ్లీ ద్వారకా ప్రాంతంలోని అద్దె ఇంటిలో కలిసి జీవించసాగారు.
వీరిద్దరి మధ్య ప్రేమ గురించి సాహిల్ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. దాంతో సాహిల్ కుటుంబసభ్యులు మరో మహిళతో వివాహం నిశ్చయించారు. ఫిబ్రవరి 10న వివాహ తేదీని ఖరారు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిక్కీ.. సాహిల్ తో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో సాహిల్ తన కారులో ఉంచిన మొబైల్ ఫోన్ డేటా కేబుల్ సహాయంతో నిక్కీ గొంతు నొక్కి హతమార్చాడు. అనంతరం తనకు చెందిన దాబాలోని ఫ్రిడ్జ్ లో ఉంచాడు. అనంతరం ఏమీ ఎరుగనట్లు ఇంటికి వెళ్లి.. పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకున్నాడు. మంగళవారం (ఫిబ్రవరి 14) ధాబాలోని ఫ్రిడ్జ్ లో మృతదేహం ఉందని గుర్తించి.. పోలీసులు సాహిల్ ను అరెస్ట్ చేశారు.
Next Story